మంచి సాహిత్యం 2

చిత్రం : "ఓ పాపా లాలి"

మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా....
రేగే మూగ తలపే వలపు పంటరా..

వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చిలికెను
చెంతచేరి ఆదమరచి ప్రేమను కొసరెను
చందనాల జల్లు కురిసె చూపులు కలిసెను
చందమామ పట్టపగలె నింగిని పొడిచెను
కన్నెపిల్ల కలలే నాకిక లోకం
సన్నజాజి కలలే మోహనరాగం
చిలకల పలుకులు అలకల ఉలుకులు
నా చెలి సొగసులు నన్నే మరిపించే....

ముద్దబంతి లేతనవ్వులే చిందెను మధువులు
ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు
హరివిల్లులోని రంగులు నా చెలి సొగసులు
వేకువల మేలుకొలుపే నా చెలి పిలిపులు
సందెవేళ పలికే నాలో పల్లవి
సంతసాల సిరులే నావే అన్నవి
ముసిముసి తలపులు కరగని వలపులు
నా చెలి సొగసులు అన్ని ఇక నావే....

మంచి సాహిత్యం 1

చిత్రం : "విచిత్ర సొదరులు"

నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే

నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే
ఆ నింగినెన్నటికి ఈ భూమి చేరదనీ
నాడు తెలియదులే ఈనాడు తెలిసెనులే ఓ చెలీ....

ఆడుకుంది నాతో జాలి లేని దైవం
పొంద లేక నిన్ను ఓడిపోయె జీవితం
జోరు వానలోన ఉప్పునైతి నేనే
హొరు గాలిలోన వూకనైతి నేనే
గాలి మేడలె కట్టుకొన్న చిత్రమే అది చిత్రమే
సత్యమేదో తెలుసుకొన్న చిత్రమే అది చిత్రమే
కథ ముగిసేను కాదా.. కల చెదిరేను కాదా అంతే....

కళ్ళలోన నేను కట్టుకున్న కోట
నేడు కూలి పోయె ఆశ తీరుపూట
కోరుకున్న యోగం జారుకుంది నేడు
చీకటేమో నాలో చేరుకొంది చూడు
రాసి ఉన్న తలరాత తప్పదు చిత్రమే అది చిత్రమే
గుండె కోతలె నాకు ఇప్పుడు చిత్రమే అది చిత్రమే
కథ ముగిసేను కాదా.. కల చెదిరెను కాదా అంతే....