మంచి సాహిత్యం 10

చిత్రం: "ఆవకాయ బిర్యాని"

అదిగదిగొ ఆశలు రేపుతూ..ఎదురుగా వాలే ఎన్నొ వర్ణాలు..
ఇదిగిదిగో కలలను చూపుతూ..ఎదలను ఏలే ఏవో వైనాలు..

ఎగిరొచ్చే ఆ గువ్వలా..చిగురించే ఈ నవ్వులా..సాగే సావాసం..
ప్రతి హృదయంలొ ఆ కల..నిజమైతే అపేదేలా..పొంగే ఆనందం..
కలైన..ఇదో కధైన..రచించే ఏవొ రాగాలే..
ఈ సమయం ఏ తలపులలొ తన గురుతుగ విడిచెలుతుందో..
ఈ మనసుకు జత ఏదంటే తను ఏమని బదులిస్తుందో..

వరమనుకొ దొరికిన జీవితం..ఋతువులు గీసే రంగుల ఓ చిత్రం..
ఈ పయనం ఏ మలుపులొ తన గమ్యన్నే చేరునొ..చూపే దారేది..
వరించే ప్రతి క్షణాన్ని..జయించే స్నేహం తోడవని..
తన గూటిని వెతికే కళ్ళు..గమనించవు యద లోగిల్లు..
తల వాల్చిన మలి సంధ్యల్లొ..శెలవడిగేను తొలి సందడ్లు..

మంచి సాహిత్యం 9

చిత్రం: "హరే రాం"

సరిగా పడని ఇపుడే తొలి అడుగు..
సుడిలొ పడవై ఎపుడూ తడబడకు..

మాయలొ మగతలొ మరుపు ఇంకెన్నాళ్ళు
వేకువై వెలగని తెరవిదే నీ కళ్ళు
కన్నవడి వదలాల్సిందే నీలా నువ్వు నిలవాలంటే..
మన్ను తడి తగలాల్సిందే మునుముందుకు సాగాలంటే..
కిందపడి లేవాల్సిందే కాలంతో గెలవాలంటే..

సరిగా పడని ఇపుడే తొలి అడుగు..
సుడిలొ పడవై ఎపుడూ తడబడకు..

నిన్నే చూసే అద్దం కూడా నువ్వా కాదా అనదా..
అచ్చం నీలా ఉండేదెవరా అంటూ లోకం ఉలికిపడదా..

సుర్యుడిలొ చిచ్చల్లే రగిలించే నీలొ కోపం..దీపంలా వెలిగిందా జనులందరిలొ..
చంద్రుడిలొ మచ్చల్లే అనిపించే ఏదో లోపం..కుందేలై అందంగా కనపడదా నీలా నవ్వే క్షణాలలో..

సరిగా పడని ఇపుడే తొలి అడుగు..
సుడిలొ పడవై ఎపుడూ తడబడకు..

చెక్కే వులితొ నడిచావనుకొ..దక్కే విలువే తెలిసే
తొక్కే కాళ్ళే మొక్కేవాళ్ళై..దైవం అనరా శిలను కొలిచి
అమృతమే నువ్వుపొందు విషమైతే అది నా వంతు అనగలిగే నీ మనసే ఆ శివుడిల్లు
అందరికి బతుకిచ్చే పోరాటంలొ ముందుండు కైలాసం శిరసొంచి నీ ఎదలో ఒదిగే వరకు

సరిగా పడని ఇపుడే తొలి అడుగు..
సుడిలొ పడవై ఎపుడూ తడబడకు..
మాయలొ మగతలొ మరుపు ఇంకెన్నాళ్ళు
వేకువై వెలగని తెరవిదే నీ కళ్ళు

మంచి సాహిత్యం 8

చిత్రం: "గమ్యం "

ఎంతవరకు ఎందుకొరకు వింతపరుగు అనీయనట్టు
గమనమే నీ గమ్యమైతే బాటలొనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలొనే బదులువుంది గుర్తు పట్టే గుండెనడుగు

ప్రపంచం నీలొవున్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకొవా….
తెలిస్తే ప్రతీచోట నిను నువ్వే కలుసుకొని పలకరించిపొవా….

కనపడేవెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రమంటారు కడగలే ఒక్కొక్క అల పేరు..
మనకిలా ఎదురైన ప్రతివారు మనిషనే సంద్రాన కెరటాలు,పలకరే మనిషి అంటే ఎవరూ….

సరిగా చూస్తున్నదా నీ మది,మదిలొ నువ్వేకదా వున్నది
చుట్టూ అద్దాలలొ విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నవి
నీ ఊపిరిలొ లేదా గాలి,వెలుతురు నీ చూపుల్లొ లేదా….
మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే నువ్వే కాదా కాదా….

ప్రపంచం నీలొవున్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకొవా….
తెలిస్తే ప్రతీచోట నిను నువ్వే కలుసుకొని పలకరించిపొవా….

మనసులో నీవైన భావాలే బయటకనిపిస్తాయి దృశ్యాలై,నీడలు నిజాల సాక్ష్యాలే
శత్రువులు నీలొని లొపాలే,స్నేహితులు నీకున్న ఇష్టాలే,ఋతువులు నీ భావచిత్రాలే

ఎదురైన మందహసం నీలొని చెలిమి కోసం
మోసం రొషం ద్వేషం నీ మకిలి మతికి భాష్యం

పుట్టుక చావు రెండే రెండు నీకవి సొంతం కావు పోనీ….
జీవిత కాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కానీ….

మంచి సాహిత్యం 7

చిత్రం: "ఈ అబ్బాయి చాలా మంచోడు"

ఒక మనసుతొ ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు..ఆ ముడి ఒక కొంగుముడయ్యేదాకా ఊరుకోవూ ప్రేమా...
ఒక మనసుతొ ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు..ఆ ముడి ఒక కొంగుముడయ్యేదాకా ఊరుకోవూ ప్రేమా...

పసి పాపలొ ముసి నవ్వులా కపటాలు లేని ప్రేమ.. ముని మాపులొ మరు మల్లేలా మలినాలు లేని ప్రేమ..
అర చేతిలొ నెలవంకలా తెర చాటు లేని ప్రేమ.. నది గొంతులో అల పాటలా తడబాటు లేని ప్రేమ..
మనసుల కలిమిడి ఫలితం ప్రేమ తనువుల తాకిడి కాదు సుమా, అనంత జీవయాత్రలొ తొడు ప్రేమ..ప్రేమా..

ఒక మనసుతొ ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు..ఆ ముడి ఒక కొంగుముడయ్యేదాకా ఊరుకోవూ..

అదరాలలొ తడి మెరుపులా మెరిసేది కాదు ప్రేమ..హృదయాలలొ ధ్రువ తారలా అలరారుతుంది ప్రేమ..
పరువాలతొ కరచాలనం చేసేది కాదు ప్రేమ..ప్రాణాలలొ స్థిరబంధనం నెలకొల్పుతుంది ప్రేమ..
మమతల అమృతవర్షిణి ప్రేమ కొర్కేల అలజడి కాదు సుమా, నిశీధిలొను వీడిపోని నీడ ప్రేమ..ప్రేమా..

ఒక మనసుతొ ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు..ఆ ముడి ఒక కొంగుముడయ్యేదాకా ఊరుకోవూ..ప్రేమా..

మంచి సాహిత్యం 6

చిత్రం: "నీ స్నేహం"

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా..ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా..మువ్వలే మనసుపడు పాదమా..ఊహలే ఉలికిపడు ప్రాయమా..హిందొళంలా సాగే అందాల సెలయేరమ్మా..ఆ ఆ ఆ ఆమని మధువనమా..ఆ ఆ ఆ ఆమని మధువనమా..

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా..ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా..

పసిడి వేకువలు పండు వెన్నెలలు పసితనాలు పరువాల వెల్లువలు కలిపి నిన్ను మలిచాడొ ఏమో బ్రహ్మ..
పచ్చనైన వరి చేల సంపదలు అచ్చ తెనుగు మురిపాల సంగతులు కళ్ళ ముందు నిలిపావే ముద్దుగుమ్మా..
పాలకడలి కెరటాల వంటి నీ లేత అడుగు తన యెదను మీటి నేలమ్మ పొంగెనమ్మా..ఆ ఆ ఆ ఆగని సంబరమా ఆ ఆ ఆ అగని సంబరమా..
వరములన్ని నిను వెంటబెట్టుకుని ఎవరి ఇంట దీపాలు పెట్టమని అడుగుతున్నవే కుందనాలా బొమ్మా..
సిరుల రాణిని చేయిబట్టి శ్రీహరిగమారునని రాసిబెట్టి ఏ వరుని జాతకం వేచివున్నదమ్మా..
అన్నమయ్య శృంగార కీర్తనల వర్ణనలకు ఆకారమైన బంగారు చిలకవమ్మా..
ఆ ఆ ఆ ఆమని సుమశరమా ఆ ఆ ఆ కాముని సుమశరమా..

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా..ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా..మువ్వలే మనసుపడు పాదమా..
ఊహలే ఉలికిపడు ప్రాయమా..హిందొళంలా సాగే అందాల సెలయేరమ్మా..ఆమని మధువనమా..ఆ ఆ ఆ ఆమని మధువనమా..

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా..ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా..

ఒక చిన్న స్వీట్ మెమోరీ 1

::ఒక చిన్న స్వీట్ మెమోరీ::

నేను చిన్నప్పట్టి నుండి కొద్దిగా తమాషాగ అల్లరిగా ఉండేవాడిని. ఒకసారి నేను 7వ తరగతిలొ అనుకుంటా యూనిట్ పరీక్షల కొసం ఇరగ లెవెల్లొ చదువుతున్నా, నేను నిజంగా చదువుతున్నాననుకొకండి మనకు అంత ఇంట్రెస్ట్ ఎక్కడిది.. ఇంట్లొ పెద్దలకి భయపడి పుస్తకం చూస్తూ ఏదొ అలొచిస్తున్నా. ఇంతలొ డిడి [దూర దర్శన్]లొ వార్తలు చెప్పే వాళ్ళు గుర్తుకు వచ్చారు, వాళ్ళు అంత సేపు తప్పులు లేకుండా ఎలా చదువుతారబ్బా కింద పేపర్స్ కూడ సూడకుండా అనుకుని, మనము కూడా ఒకసారి ప్రాక్టీసు చేత్తే పొలా అని ఇలా స్టార్ట్ చేశా: (నేను సైన్సు పరీక్షకి ప్రిపేరు అవుతున్నానప్పుడు)

నమస్కారం : [రెండు చేతులతొ నమస్కారం చేసి చిన్న స్మయిల్ ఇచ్చి] : ఈరోజు ముఖ్యాంశాలు : (కాసేపు ఆగి)…ఈరొజు మొక్కల్లొ అంటుకట్టే రకాలు గురించి తెలుసుకుందాం: అంట్లు కట్టడం రెండు రకాలు....అవి....ఇవి....అలా వార్తల్లొ ఎలా చదువుతారో ఎక్సాట్టుగా అలానే చెప్పుకు పొతున్నా (అదీ గొంతు మార్చి మరీ సదువుతున్నా) ఏదేదొ చెప్పా (అంత గుర్తుకు లేదు ఆ పాఠం), మధ్యలొ చెప్పేటప్పుడు గుర్తుకు రాకపొతే కింద పుస్తకం చూస్తున్నా ఎవరూ నన్ను గమనించనట్టు .... చివర్లొ ఇంతటితొ ఈ వార్తలు సమాప్తం అని మళ్ళీ స్మయిల్ ఇచ్చి సెలవు అన్నా: ఇంతలొ ఏదొ శబ్దం అయినట్టుంటే వెనక్కి తిరిగి చూశా….

""""షాక్""""????

నా క్లాసుమేట్సు పద్మా (లీడరు) ఇంకా స్వాతి నా వెనకాలే నుంచుని వున్నారు, ఎప్పుడు వచ్చారొ తెలియదు నే చెప్పిందంతా విన్నట్టున్నారు ఒకటే నవ్వు , నేను చూస్తున్నాగాని వాళ్ళు నవ్వు ఆపడం లేదు....ఇక నాకు ఏమి చెయ్యాలొ అర్దం కాలా.... ఒక చిన్న స్మయిల్ ఇచ్చి అక్కడ నుంచి ఒక పరుగుతీశా.... ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు, ఏదొ భయం....వాళ్ళిద్దరు క్లాస్సులొ అందరితొ చెప్పేస్తారేమో అని....ఆ తరువాత రోజు స్కూలికి వెళ్ళినప్పుడు మోహం ఎక్కడ పెట్టుకొవాలొ ఆర్దం కాలేదు....

తనదైన నా మనసు

మొన్న చిన్న పని ఉండి ఇంటికి వెళ్ళాను, ఒక ఫంక్షన్ కోసం. ఆ ఫంక్షనుకి నా ప్రేమ కూడా వచ్చింది. తెల్లని డ్రెస్సులొ అచ్చం ఎంజెల్ లాగా కనిపించింది నాకు. అదేంటొ ఈ సారి వెళ్ళినప్పుడు రెండు సార్లు కలిసే ఛాన్సు దొరికింది. ఎంతైనా ఆ అనుభూతే వేరు..మాటలకందని, అభివర్ణించలేని అనుభూతి అది. తనను చూస్తుంటే గుండెలొ అలల పొటులాగా అనిపించింది నాకు. ఏదొ తెలియని ఫీలింగ్ హృదయంలొ పొంగి పొర్లుతుంది..తను ఎక్కడున్నాగాని నా కన్నులు తన కోసం అన్నింటిని చీల్చుకుంటూ తనను కలిసే ప్రయత్నం చేశాయి. కాని అవి తనను చేరుతాయే గాని తన మనసులొ ఏం వుందొ కనిపెట్టలేవు.. నా కన్నులు తన కన్నులు నన్ను గమనిస్తున్నాయేమో అని తెలుసుకొటానికి అరాటపడేవి..మనుష్యులతొ సంబంధం లేకుండా మనసులు తమంతట తామే మాట్లాడుకొగల శక్తి ఉంటే ఎంత బాగుండునో కదా అనిపించింది. అలా అవ్వగలిగితే ఈ భౌతికమైన శరీరాల అవసరం ఏముంది... నా మనసులొ ఉన్న తన గురించి తనకు తెలుసన్న సంగతి నేను తెలుసుకొగలిగితే నేను ఈ ప్రపంచాన్ని జయించినట్లే....

ఎవరికైనా గాని వాళ్ళు మనసుపడిన వాళ్ళు ఎదురుగా ఉంటే అంతకన్నా వాళ్ళకి కావలిసింది, కొరుకునేది వేరే ఏముంటుంది. తనతొ మాట్లాడానికి నా మనసు ఎన్నొ విధాలుగా ఎంతగానొ ప్రయత్నించింది. నాకు తెలియకుండానే నా అడుగులు తన వైపు నడవడానికి ప్రయత్నించాయి. తనను చూస్తే నేను ఇంతగా అదుపు తప్పుతానా అని నాకే ఆశ్చర్యం వేసింది. తన ముఖం వైపు చూస్తు వుండిపొవాలని, తనకు నా మనసులొ ఉన్న వ్యధ గురించి వివరించాలని, తనకు ఇంకా ఎన్నెన్నొ సంగతులు చెప్పాలనిపించింది. కాని నా నిస్సహయతకు నాకే సిగ్గేసింది. ప్రేమ అనే ఈ అనుభూతి ఎంతో విచిత్రమైనదొ కదా....

కార్యక్రమం పూర్తయ్యాక తనవాళ్ళందరు బయలుదేరే సమయములొ కాసేపు అందరం కలిసి మట్లాడుకుంటున్నాం. తను నన్ను గమనించాలి అన్నట్లుగా తనను చూస్తూనే ఉన్నాను. తను చూసి చూడనట్లుగా ఉందే గాని సూటిగా నా కళ్ళల్లొకి చూడ ప్రయత్నం చేయలేదు. ఒక్క మాట చాలు తనకు నా మధ్య ఉన్న ఈ అఖాతం తొలిగిపొడానికి. కాని ఎప్పుడు ఎక్కడ ఎలా ఆరంభం....

మంచి సాహిత్యం 5

చిత్రం : "స్వర్ణ కమలం"

శివ పూజకు చివురించిన సిరి సిరి మువ్వా
శివ పూజకు చివురించిన సిరి సిరి మువ్వా
సిరి సిరి మువ్వా సిరి సిరి మువ్వా
మృదు మంజుల పదమంజరి పూచిన పువ్వా
సిరి సిరి మువ్వా సిరి సిరి మువ్వా
యతిరాజుకు జతి స్వరముల పరిమళమివ్వా
సిరి సిరి మువ్వా సిరి సిరి మువ్వా
నటనాంజలితొ బ్రతుకును తరించనీవా
సిరి సిరి మువ్వా సిరి సిరి మువ్వా

పరుగాపక పయనించవే తలపుల నావ
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ
ఎదిరించిన సుడి గాలిని జయించి నావా
మది కోరిన మధు సీమలు వరించి రావా
పరుగాపక పయనించవే తలపుల నావ
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

పడమర పడగలపై మెరిసే తారలకై
పడమర పడగలపై మెరిసే తారలకై
రాత్రిని వరించకే సంధ్యా సుందరి
తూరుపు వేదికపై వేకువ నర్తకివై
తూరుపు వేదికపై వేకువ నర్తకివై
ధాత్రిని మురిపించే కాంతులు చిందని
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని
నిదురించిన హృదయ రవళి ఓంకారం కాని

తన వ్రేళ్ళే సంకెళ్ళై కదలలేని మొక్కలా
ఆమనికై ఎదురు చూస్తు ఆగిపోకు ఎక్కడా
అవధి లేని అందముంది అవనికి నలుదిక్కులా
ఆనందపు గాలి వాలు నడపని నిన్నిలా
ప్రతి రోజొక నవ గీతిక స్వాగతించగా
వెన్నెల కిన్నెర గానం నీకు తోడుగా

చలిత చరణ జనితం నీ సహజ విలాసం
జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం
నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం
నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం
గగన సరసి హృదయంలో వికసిత శతదళ శోభిత సువర్ణ కమలం

మంచి సాహిత్యం 4

చిత్రం : "స్వర్ణ కమలం"

ఆ అ అ ఆ అ ఆ ఆ అ అ ఆ ఆ అ ఆ ఆ...
కొత్తగా రెక్కలొచ్చెన గూటిలోని గువ్వపిల్లకి
మెత్తగా రేకు విచ్చేనా
మెత్తగా రేకు విచ్చేనా
కొమ్మచాటునున్న కన్నెమల్లెకి కొమ్మచాటునున్న కన్నెమల్లెకి

కొండదారి మార్చింది కొంటెవాగు జోరు
కులుకులెన్నో నేర్చింది కలికియేటి నీరు
అహ అహహహ హహహహ ఆఅ
కొండదారి మార్చింది కొంటెవాగు జోరు
కులుకులెన్నో నేర్చింది కలికియేటి నీరు
బండరాళ్ళ హొరుమారి పంటచేల పాటలూరి
బండరాళ్ళ హొరుమారి పంటచేల పాటలూరి
మేఘాల రాగాల మాగని వూగేలా
సిరిచిందు లేసింది కనువిందు చేసింది

వెదురులోకి వొదిగింది కుదురులేని గాలి
యెదురులేక యెదిగింది మధురగానకేళి
అహ అహహహ హహహహ ఆఅ
వెదురులోకి వొదిగింది కుదురులేని గాలి
యెదురులేక యెదిగింది మధురగానకేళి
భాషలోన రాయలేని రాసలీల రేయిలోని అబ్బ
భాషలోన రాయలేని రాసలీల రేయిలోని
యమునా తరంగాల కమనీయ శ్రుంగార
కళలెన్నో చూపింది కలలెన్నో రేపింది!!

మంచి సాహిత్యం 3

చిత్రం : "స్వర్ణ కమలం"

ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే త్రుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వొళ్ళు
నల్ల మబ్బు చల్లని.. చల్లని చిరు జల్లు
నల్ల మబ్బు చల్లని.. చల్లని చిరు జల్లు
పల్లవించనీ నేలకు పచ్చని పరవళ్ళు

ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లే త్రుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వొళ్ళు
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
ఎల్లలన్నవే ఎరగని వేగంతో వెళ్ళు

లయకే నిలయమై నీపాదం సాగాలి అహాహహ..
మలయానిల గతిలో సుమ బాలగ తూగాలి
వలలో వొదుగునా విహరించే చిరుగాలి
సెలయేటికి నటనం నేర్పించే గురువేడి..
తిరిగే కాలానికీ ఆఅ ఆఆ...
తిరిగే కాలానికీ తీరొకటుంది
అది నీ పాఠానికి దొరకను అంది
నటరాజ స్వామి జటా జూటిలోకి చేరకుంటే
విరుచుకుపడు సురగంగకు విలువేముంది విలువేముందీ!!

దూకే అలలకు ఏ తాళం వేస్తారు అహాహహ..
కమ్మని కలల పాట ఏ రాగం అంటారు
అలలకు అందునా ఆశించిన ఆకాశం
కలలా కరగడమా జీవితాన పరమార్ధం
వద్దని ఆపలేరు ఆఅ ఆఅ..
వద్దని ఆపలేరు ఉరికే ఊహని
హద్దులు దాటరాదు ఆశల వాహిని
అదుపెరుగని ఆటలాడు వసంతాలు వలదంటే
విరి వనముల పరిమళముల విలువేముంది విలువేముందీ !!

మంచి సాహిత్యం 2

చిత్రం : "ఓ పాపా లాలి"

మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు
అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు
ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా....
రేగే మూగ తలపే వలపు పంటరా..

వెన్నెలల్లె పూలు విరిసి తేనెలు చిలికెను
చెంతచేరి ఆదమరచి ప్రేమను కొసరెను
చందనాల జల్లు కురిసె చూపులు కలిసెను
చందమామ పట్టపగలె నింగిని పొడిచెను
కన్నెపిల్ల కలలే నాకిక లోకం
సన్నజాజి కలలే మోహనరాగం
చిలకల పలుకులు అలకల ఉలుకులు
నా చెలి సొగసులు నన్నే మరిపించే....

ముద్దబంతి లేతనవ్వులే చిందెను మధువులు
ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు
హరివిల్లులోని రంగులు నా చెలి సొగసులు
వేకువల మేలుకొలుపే నా చెలి పిలిపులు
సందెవేళ పలికే నాలో పల్లవి
సంతసాల సిరులే నావే అన్నవి
ముసిముసి తలపులు కరగని వలపులు
నా చెలి సొగసులు అన్ని ఇక నావే....

మంచి సాహిత్యం 1

చిత్రం : "విచిత్ర సొదరులు"

నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే

నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే
ఆ నింగినెన్నటికి ఈ భూమి చేరదనీ
నాడు తెలియదులే ఈనాడు తెలిసెనులే ఓ చెలీ....

ఆడుకుంది నాతో జాలి లేని దైవం
పొంద లేక నిన్ను ఓడిపోయె జీవితం
జోరు వానలోన ఉప్పునైతి నేనే
హొరు గాలిలోన వూకనైతి నేనే
గాలి మేడలె కట్టుకొన్న చిత్రమే అది చిత్రమే
సత్యమేదో తెలుసుకొన్న చిత్రమే అది చిత్రమే
కథ ముగిసేను కాదా.. కల చెదిరేను కాదా అంతే....

కళ్ళలోన నేను కట్టుకున్న కోట
నేడు కూలి పోయె ఆశ తీరుపూట
కోరుకున్న యోగం జారుకుంది నేడు
చీకటేమో నాలో చేరుకొంది చూడు
రాసి ఉన్న తలరాత తప్పదు చిత్రమే అది చిత్రమే
గుండె కోతలె నాకు ఇప్పుడు చిత్రమే అది చిత్రమే
కథ ముగిసేను కాదా.. కల చెదిరెను కాదా అంతే....

ఒక కల

కలలొ కలగా మిగిలే నీ స్నేహం
అలలొ అలగా పొంగే ఈ భారం
మనసులొ మనసుకి స్థానం లేక
ఆగక పొంగెనే కన్నీళ్ళూ....కలగా మిగిలెనే మన ఈ పరిచయాలు....

ప్రేమతొ ప్రేమను పంచుకొలేక
మనసుతో మనసును మలచుకొలేక
కల్లల్లొ కన్నీరు గుండెల్లొ సుడి గాలులు వీచె సరికి ప్రేమ అనే ఈ మనసు కంటికి కనిపించని
వేగముతొ వీడిపొయెను మన ఈ....

ఓ చెలి....

పచ్చని పొలాల్లొ వీచే పైర గాలి వొలె..
తెల్లని చందమామ చల్లని వెన్నెల వొలె..
నీలి ఆకాశంలొని విశాలపు నీడ వొలె..
ఎర్రటి సంధ్య కిరణముల వేడి తాకిడి వొలె..

నా మదిలొ వీచిన ఆ ప్రేమ మధురిమలు, ఓ చెలి తాకవా నిన్ను నీవు ఎచటనున్నాగాని??