మంచి సాహిత్యం 5

చిత్రం : "స్వర్ణ కమలం"

శివ పూజకు చివురించిన సిరి సిరి మువ్వా
శివ పూజకు చివురించిన సిరి సిరి మువ్వా
సిరి సిరి మువ్వా సిరి సిరి మువ్వా
మృదు మంజుల పదమంజరి పూచిన పువ్వా
సిరి సిరి మువ్వా సిరి సిరి మువ్వా
యతిరాజుకు జతి స్వరముల పరిమళమివ్వా
సిరి సిరి మువ్వా సిరి సిరి మువ్వా
నటనాంజలితొ బ్రతుకును తరించనీవా
సిరి సిరి మువ్వా సిరి సిరి మువ్వా

పరుగాపక పయనించవే తలపుల నావ
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ
ఎదిరించిన సుడి గాలిని జయించి నావా
మది కోరిన మధు సీమలు వరించి రావా
పరుగాపక పయనించవే తలపుల నావ
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ

పడమర పడగలపై మెరిసే తారలకై
పడమర పడగలపై మెరిసే తారలకై
రాత్రిని వరించకే సంధ్యా సుందరి
తూరుపు వేదికపై వేకువ నర్తకివై
తూరుపు వేదికపై వేకువ నర్తకివై
ధాత్రిని మురిపించే కాంతులు చిందని
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కాని
నిదురించిన హృదయ రవళి ఓంకారం కాని

తన వ్రేళ్ళే సంకెళ్ళై కదలలేని మొక్కలా
ఆమనికై ఎదురు చూస్తు ఆగిపోకు ఎక్కడా
అవధి లేని అందముంది అవనికి నలుదిక్కులా
ఆనందపు గాలి వాలు నడపని నిన్నిలా
ప్రతి రోజొక నవ గీతిక స్వాగతించగా
వెన్నెల కిన్నెర గానం నీకు తోడుగా

చలిత చరణ జనితం నీ సహజ విలాసం
జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం
నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం
నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం
గగన సరసి హృదయంలో వికసిత శతదళ శోభిత సువర్ణ కమలం

మంచి సాహిత్యం 4

చిత్రం : "స్వర్ణ కమలం"

ఆ అ అ ఆ అ ఆ ఆ అ అ ఆ ఆ అ ఆ ఆ...
కొత్తగా రెక్కలొచ్చెన గూటిలోని గువ్వపిల్లకి
మెత్తగా రేకు విచ్చేనా
మెత్తగా రేకు విచ్చేనా
కొమ్మచాటునున్న కన్నెమల్లెకి కొమ్మచాటునున్న కన్నెమల్లెకి

కొండదారి మార్చింది కొంటెవాగు జోరు
కులుకులెన్నో నేర్చింది కలికియేటి నీరు
అహ అహహహ హహహహ ఆఅ
కొండదారి మార్చింది కొంటెవాగు జోరు
కులుకులెన్నో నేర్చింది కలికియేటి నీరు
బండరాళ్ళ హొరుమారి పంటచేల పాటలూరి
బండరాళ్ళ హొరుమారి పంటచేల పాటలూరి
మేఘాల రాగాల మాగని వూగేలా
సిరిచిందు లేసింది కనువిందు చేసింది

వెదురులోకి వొదిగింది కుదురులేని గాలి
యెదురులేక యెదిగింది మధురగానకేళి
అహ అహహహ హహహహ ఆఅ
వెదురులోకి వొదిగింది కుదురులేని గాలి
యెదురులేక యెదిగింది మధురగానకేళి
భాషలోన రాయలేని రాసలీల రేయిలోని అబ్బ
భాషలోన రాయలేని రాసలీల రేయిలోని
యమునా తరంగాల కమనీయ శ్రుంగార
కళలెన్నో చూపింది కలలెన్నో రేపింది!!

మంచి సాహిత్యం 3

చిత్రం : "స్వర్ణ కమలం"

ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే త్రుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వొళ్ళు
నల్ల మబ్బు చల్లని.. చల్లని చిరు జల్లు
నల్ల మబ్బు చల్లని.. చల్లని చిరు జల్లు
పల్లవించనీ నేలకు పచ్చని పరవళ్ళు

ఘల్లు ఘల్లు ఘల్లు మంటు మెరుపల్లే త్రుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వొళ్ళు
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
వెల్లువొచ్చి సాగనీ తొలకరి అల్లర్లు
ఎల్లలన్నవే ఎరగని వేగంతో వెళ్ళు

లయకే నిలయమై నీపాదం సాగాలి అహాహహ..
మలయానిల గతిలో సుమ బాలగ తూగాలి
వలలో వొదుగునా విహరించే చిరుగాలి
సెలయేటికి నటనం నేర్పించే గురువేడి..
తిరిగే కాలానికీ ఆఅ ఆఆ...
తిరిగే కాలానికీ తీరొకటుంది
అది నీ పాఠానికి దొరకను అంది
నటరాజ స్వామి జటా జూటిలోకి చేరకుంటే
విరుచుకుపడు సురగంగకు విలువేముంది విలువేముందీ!!

దూకే అలలకు ఏ తాళం వేస్తారు అహాహహ..
కమ్మని కలల పాట ఏ రాగం అంటారు
అలలకు అందునా ఆశించిన ఆకాశం
కలలా కరగడమా జీవితాన పరమార్ధం
వద్దని ఆపలేరు ఆఅ ఆఅ..
వద్దని ఆపలేరు ఉరికే ఊహని
హద్దులు దాటరాదు ఆశల వాహిని
అదుపెరుగని ఆటలాడు వసంతాలు వలదంటే
విరి వనముల పరిమళముల విలువేముంది విలువేముందీ !!