మంచి సాహిత్యం 8

చిత్రం: "గమ్యం "

ఎంతవరకు ఎందుకొరకు వింతపరుగు అనీయనట్టు
గమనమే నీ గమ్యమైతే బాటలొనే బ్రతుకు దొరుకు
ప్రశ్నలొనే బదులువుంది గుర్తు పట్టే గుండెనడుగు

ప్రపంచం నీలొవున్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకొవా….
తెలిస్తే ప్రతీచోట నిను నువ్వే కలుసుకొని పలకరించిపొవా….

కనపడేవెన్నెన్ని కెరటాలు కలగలిపి సముద్రమంటారు కడగలే ఒక్కొక్క అల పేరు..
మనకిలా ఎదురైన ప్రతివారు మనిషనే సంద్రాన కెరటాలు,పలకరే మనిషి అంటే ఎవరూ….

సరిగా చూస్తున్నదా నీ మది,మదిలొ నువ్వేకదా వున్నది
చుట్టూ అద్దాలలొ విడి విడి రూపాలు నువ్వు కాదంటున్నవి
నీ ఊపిరిలొ లేదా గాలి,వెలుతురు నీ చూపుల్లొ లేదా….
మన్ను మిన్ను నీరు అన్నీ కలిపితే నువ్వే కాదా కాదా….

ప్రపంచం నీలొవున్నదని చెప్పేదాకా ఆ నిజం తెలుసుకొవా….
తెలిస్తే ప్రతీచోట నిను నువ్వే కలుసుకొని పలకరించిపొవా….

మనసులో నీవైన భావాలే బయటకనిపిస్తాయి దృశ్యాలై,నీడలు నిజాల సాక్ష్యాలే
శత్రువులు నీలొని లొపాలే,స్నేహితులు నీకున్న ఇష్టాలే,ఋతువులు నీ భావచిత్రాలే

ఎదురైన మందహసం నీలొని చెలిమి కోసం
మోసం రొషం ద్వేషం నీ మకిలి మతికి భాష్యం

పుట్టుక చావు రెండే రెండు నీకవి సొంతం కావు పోనీ….
జీవిత కాలం నీదే నేస్తం రంగులు ఏం వేస్తావో కానీ….

మంచి సాహిత్యం 7

చిత్రం: "ఈ అబ్బాయి చాలా మంచోడు"

ఒక మనసుతొ ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు..ఆ ముడి ఒక కొంగుముడయ్యేదాకా ఊరుకోవూ ప్రేమా...
ఒక మనసుతొ ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు..ఆ ముడి ఒక కొంగుముడయ్యేదాకా ఊరుకోవూ ప్రేమా...

పసి పాపలొ ముసి నవ్వులా కపటాలు లేని ప్రేమ.. ముని మాపులొ మరు మల్లేలా మలినాలు లేని ప్రేమ..
అర చేతిలొ నెలవంకలా తెర చాటు లేని ప్రేమ.. నది గొంతులో అల పాటలా తడబాటు లేని ప్రేమ..
మనసుల కలిమిడి ఫలితం ప్రేమ తనువుల తాకిడి కాదు సుమా, అనంత జీవయాత్రలొ తొడు ప్రేమ..ప్రేమా..

ఒక మనసుతొ ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు..ఆ ముడి ఒక కొంగుముడయ్యేదాకా ఊరుకోవూ..

అదరాలలొ తడి మెరుపులా మెరిసేది కాదు ప్రేమ..హృదయాలలొ ధ్రువ తారలా అలరారుతుంది ప్రేమ..
పరువాలతొ కరచాలనం చేసేది కాదు ప్రేమ..ప్రాణాలలొ స్థిరబంధనం నెలకొల్పుతుంది ప్రేమ..
మమతల అమృతవర్షిణి ప్రేమ కొర్కేల అలజడి కాదు సుమా, నిశీధిలొను వీడిపోని నీడ ప్రేమ..ప్రేమా..

ఒక మనసుతొ ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు..ఆ ముడి ఒక కొంగుముడయ్యేదాకా ఊరుకోవూ..ప్రేమా..