తనదైన నా మనసు

మొన్న చిన్న పని ఉండి ఇంటికి వెళ్ళాను, ఒక ఫంక్షన్ కోసం. ఆ ఫంక్షనుకి నా ప్రేమ కూడా వచ్చింది. తెల్లని డ్రెస్సులొ అచ్చం ఎంజెల్ లాగా కనిపించింది నాకు. అదేంటొ ఈ సారి వెళ్ళినప్పుడు రెండు సార్లు కలిసే ఛాన్సు దొరికింది. ఎంతైనా ఆ అనుభూతే వేరు..మాటలకందని, అభివర్ణించలేని అనుభూతి అది. తనను చూస్తుంటే గుండెలొ అలల పొటులాగా అనిపించింది నాకు. ఏదొ తెలియని ఫీలింగ్ హృదయంలొ పొంగి పొర్లుతుంది..తను ఎక్కడున్నాగాని నా కన్నులు తన కోసం అన్నింటిని చీల్చుకుంటూ తనను కలిసే ప్రయత్నం చేశాయి. కాని అవి తనను చేరుతాయే గాని తన మనసులొ ఏం వుందొ కనిపెట్టలేవు.. నా కన్నులు తన కన్నులు నన్ను గమనిస్తున్నాయేమో అని తెలుసుకొటానికి అరాటపడేవి..మనుష్యులతొ సంబంధం లేకుండా మనసులు తమంతట తామే మాట్లాడుకొగల శక్తి ఉంటే ఎంత బాగుండునో కదా అనిపించింది. అలా అవ్వగలిగితే ఈ భౌతికమైన శరీరాల అవసరం ఏముంది... నా మనసులొ ఉన్న తన గురించి తనకు తెలుసన్న సంగతి నేను తెలుసుకొగలిగితే నేను ఈ ప్రపంచాన్ని జయించినట్లే....

ఎవరికైనా గాని వాళ్ళు మనసుపడిన వాళ్ళు ఎదురుగా ఉంటే అంతకన్నా వాళ్ళకి కావలిసింది, కొరుకునేది వేరే ఏముంటుంది. తనతొ మాట్లాడానికి నా మనసు ఎన్నొ విధాలుగా ఎంతగానొ ప్రయత్నించింది. నాకు తెలియకుండానే నా అడుగులు తన వైపు నడవడానికి ప్రయత్నించాయి. తనను చూస్తే నేను ఇంతగా అదుపు తప్పుతానా అని నాకే ఆశ్చర్యం వేసింది. తన ముఖం వైపు చూస్తు వుండిపొవాలని, తనకు నా మనసులొ ఉన్న వ్యధ గురించి వివరించాలని, తనకు ఇంకా ఎన్నెన్నొ సంగతులు చెప్పాలనిపించింది. కాని నా నిస్సహయతకు నాకే సిగ్గేసింది. ప్రేమ అనే ఈ అనుభూతి ఎంతో విచిత్రమైనదొ కదా....

కార్యక్రమం పూర్తయ్యాక తనవాళ్ళందరు బయలుదేరే సమయములొ కాసేపు అందరం కలిసి మట్లాడుకుంటున్నాం. తను నన్ను గమనించాలి అన్నట్లుగా తనను చూస్తూనే ఉన్నాను. తను చూసి చూడనట్లుగా ఉందే గాని సూటిగా నా కళ్ళల్లొకి చూడ ప్రయత్నం చేయలేదు. ఒక్క మాట చాలు తనకు నా మధ్య ఉన్న ఈ అఖాతం తొలిగిపొడానికి. కాని ఎప్పుడు ఎక్కడ ఎలా ఆరంభం....

2 comments:

Unknown said...

మీ కవిత్వం బాగుంది. మీ బ్లాగును జల్లెడకు కలపడం జరిగినది. http://www.jalleda.com

Naga said...

నిజంగా ఇటువంటి భావాలు ఎంత గొప్పవో! బాగా రాసారు.